Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా హేన్రి డునంట్ జయంతి వేడుకలు

ఘనంగా హేన్రి డునంట్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అలాగే ప్రపంచ తలసీమియా దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో గురువారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు హేన్రి డునంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తల సేమియా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమిష్టిగా సమైక్యతతో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కలిసి నడిస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత సేవలు పెరగాలన్న నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మానసవాదులు ముందుకు వచ్చి అండగా నిలవాలన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ 84 వ సారి అలాగే రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డా అశ్విన్ కుమార్ రెడ్డి ,రామకృష్ణ రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే నిన్న బుధవారం బాల్ భవన్ లో జరిగిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ,జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, నిజామాబాదు డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, వైస్ చైర్మన్ మురళి కృష్ణ ,జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, యూత్ కోఆర్డినేటర్ మాణిక్యాల శ్రీనివాస్ ,ఎంసి మెంబర్లు శ్రీనివాస్ ,సోలమన్ ,బాబా శ్రీనివాస్, వెంకటేశ్వర్లు , డా రాజేష్ ,బొద్దుల రామకృష్ణ ,బాల్ భవన్ సూపెరిండెంటెంట్ ప్రభాకర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -