Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూసి వాగులో చిక్కుకున్న పశుల కాపరులు

మూసి వాగులో చిక్కుకున్న పశుల కాపరులు

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మండలంలోని ప్రొద్దటూరు వర్కట్ పల్లి గ్రామాల మద్యన గల మూసి వాగులో వరద ఉదృతి పెరుగడంతో  ప్రొద్దటూరుకు చెందిన పశుల కాపరులు మూసి వాగులో నాలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు.  చిక్కుకున్న వారిలో  పెద్దబోయిన బుచ్చయ్య, పలుసం ప్రశాంత్, గజ్జి శ్రీను, పలుసం చింటూ అను పశుల కాపరులు వీరు సాయంత్రం 5 గంటల సమయంలో పశువులను మేపుకుంటూ అక్కడినుండి ఇంటికి వచ్చే క్రమంలో 6 గంటల నుండి 7 గంటల సమయంలో వరద ఉదృతి పెరిగి వాగుదాటే పరిస్థితి లేక బయాందోళనతో వారు గుండుపై కూర్చొని వారివద్ద ఉన్న ఫోన్ తో 100 కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులుఅప్రమత్తమై జిల్లా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలీసుల సహకారంతో గజ ఈతగాళ్లు తాడు (రోప్)వేసి బాధితులను ఒక్కొరిని  సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాధితులు సుమారుగా 3 గంటల నుండి 4 గంటల పాటు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీటి మధ్యలో గడిపారు. బాధితులు సురక్షితంగా బయటకు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిపి ఆక్షాoష్ యాదవ్, చౌటుప్పల్ ఏ సి పి మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక తహశీల్దార్ దశరథ, ఎస్సై యూగందర్, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -