Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానో యూరియాతో సత్ఫలితాలు ఇలా..

నానో యూరియాతో సత్ఫలితాలు ఇలా..

- Advertisement -

– బహదూర్ పేటలో అవగాహన సదస్సు 
– నానో యూరియాతో పంట దిగుబడి పెరుగుతుంది
– జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణా రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

నానో యూరియాతో సత్ఫలితాలు పొందవచ్చని,ఖర్చు తగ్గి,అధిక దిగుబడి,భూసార పరిరక్షణ, పర్యావరణ హితమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణా రెడ్డి వివరించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్ పేటలో రైతులకు నానో యూరియా వాడకం పైన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది.ఈ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు నానో యూరియా వాడడం వలన కలిగే ప్రయోజనాలు, నానో యూరియా వాడే విధానము గూర్చి రైతులకు అవగాహన కల్పించడమే గాక నానో యూరియా పైన రైతులకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.

అదే విధంగా 45 కిలోల యూరియా బస్తాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా సమానం.రేటు కూడా దాదాపు సమానమే. పంటల మీద యూరియా చల్లితే సగం నత్రజని మాత్రమే మొక్కలకు చేరుతుంది.మిగిలిన యూరియా నేల,నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతుంది. అదే నానో యూరియాను స్ప్రే చేయడం ద్వారా నత్రజని నేరుగా మొక్కలకు చేరుతుంది. వృధాని అరికట్టవచ్చని అన్నారు.

 నానో యూరియా వాడడం ద్వారా యూరియా వినియోగాన్ని 25 నుంచి 40 శాతం తగ్గించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట దిగుబడి కూడా బాగా పెంచుతుంది అన్నారు పెంచుతుంది చెబుతున్నారు.పంట దిగుబడిని కూడా బాగా పెంచుతుందన్నారు. ద్రవ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని తెలిపారు.పైగా దీని రవాణా,నిల్వ, వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏఈవోలు శాలిని శివకుమార్,రైతులు స్వామి,రాజు, వినయ్ మల్లయ్య, శేఖర్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -