నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మలయాళ హీరోల దుల్కర్ సల్మాన్. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ టాలెంటెడ్ హీరో, కేరళలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ సీఎంతో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుల్కర్ సల్మాన్ కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎంని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దుల్కర్ ను రేవంత్ శాలువాతో సత్కరించారు. ఆయనతో పాటుగా సినీ నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరీ సుధాకర్ కూడా సీఎంని మీట్ అయ్యారు.