నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న భారీ పేలుడు సంఘటనతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన గురించి తెలియగానే ఇంటెలిజెన్స్‌తో పాటు శాంతి భద్రతల విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో డీజీపీ శివధర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. అంతేగాక దేవాలయాలు, ప్రార్థనామందిరాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని సంబం ధిత పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. అనుమానిత ప్రాం తాల్లో సోదాలు చేయాలని తెలిపారు. ముఖ్యంగా గుజరాత్ పోలీసులు పటు ్టకున్న జైషే-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యులలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ కూడా ఉండటంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ దిశగా తమ వైపు నుంచి దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధులలోని అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరపడం, పలు చౌరస్తాలలో వాహనాల ఆకస్మిక సోదాలు చేయడం వంటి చర్యలను పోలీస్ అధికారులు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో హైఅలర్ట్ : డీజీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



