స్వాగతం పలికిన కలెక్టర్
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్ దర్శించుకున్నారు. ఆయనతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.శరత్, జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి.రామకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యనిర్వాహణాధికారి జి.రవి ఆధ్వర్యంలో స్వామి వారి దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి ప్రసాదం, ఫొటోలను ఈఓ అందజేశారు.
ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నరసింహుని దర్శనం తన అదృష్టమన్నారు. ఆలయ నిర్మాణం అత్యంత అద్భుతమని, నిర్వహణ బాగుందని కొనియాడారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావు ఆయనకు స్వాగతం పలికారు. వారి వెంట రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, తహసీల్దార్ గణేష్ నాయక్, అధికారులు ఉన్నారు.