– వాహనాలకు ఆ రంగులేంటి?
– యుద్ధానికి వెళ్తున్నారా అంటూ అసహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైడ్రా చేస్తున్న హడావుడిపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏమైనా యుద్ధం చేసేందుకు వెళుతోందా అంటూ నిలదీసింది. హైడ్రా వాహనాలకు వేసిన రంగుల తీరును తప్పుబట్టింది. అసహజ రంగులెందుకని ప్రశ్నించింది ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకే విధుల్ని నిర్వహిస్తు న్నారా అని నిలదీసింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఉత్తర్వు ల అమలు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేసినపుడు హాజరు కావాలని ఉత్తర్వులు ఇస్తే వాటినీ తమ ప్రయోజనాలకు అనుగుణంగా మల్చుకుంటున్నారని ఆక్షేపించింది. కోర్టుకు ఉండే అధికార ప్రభావం ఏమిటో చూపిస్తామని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో తమ్మిడిగుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రయివేట్ వ్యక్తులకు చెందిన స్థలంలో చేపట్టిన పనుల్లో భాగంగా పట్టా భూముల్లో జోక్యం చేసుకోవడంపై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు యథాతథ స్థితి కొనసాగిం చాలని మధ్యంతర ఆదేశాలిస్తే వాటిని ఉల్లంఘిస్తూ హైడ్రా చర్యలు చేపడుతోందంటూ ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ రెండింటినీ కలిపి జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి బుధవారం విచారించారు. గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్‌రెడ్డి వాదిస్తూ, పిటిషనర్‌కు చెందిన ఆరెకరాల భూమిలో ఎలాం టి పనులు చేపట్టబోమనీ, మిగిలిన ప్రాంతంలో పనులు చేపట్టడానికి అనుమతించాలని కోరారు. చెరువుల పునరుద్ధ రణ పనులను తాము అడ్డుకోవడంలేదనీ, ఇటీవల సికింద్రా బాద్ ప్యాట్నీ చెరువు పనుల్లోనూ జోక్యం చేసుకోలేదని కోర్టు తెలిపింది. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ఓ పద్ధతి లేకుండా ఎన్నేళ్లు ఇలా వివాదాలను కొనసాగిస్తారని ప్రశ్నించింది. తమ్మిడిగుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధికి సంబంధించి దాఖలైన పిటిషన్‌తోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్లను సోమవారం విచారిస్తామని ప్రకటించింది.
సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ అప్పీల్ ఓబుళాపురం మైనింగ్ కేసులో హైకోర్టులో పిటిషన్
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు సీబీఐ కోర్టు విముక్తి కల్పిస్తూ వెలువరించిన తీర్పును సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులని గత మే ఆరున హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరింది. ఈ అప్పీల్‌ను విచారణ చేసేందుకు జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి నిరాకరించారు. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తొలుత సీబీఐ తరఫున శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించబోగా న్యాయ మూర్తి కల్పించుకుని వారిద్దరిలో ఒకరి తరఫున గతంలో న్యాయవాదిగా ఉండగా వాదించాననీ, అప్పీలుపై విచారణ చేపట్టలేనని తెలిపారు. అప్పీలుపై విచారణను సోమవారా నికి వాయిదా వేస్తూ సంబంధిత న్యాయమూర్తి ముందు ఫైలును ఉంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు.
జూనియర్ లైన్‌మెన్ల భర్తీపై ఎన్‌పీడీసీఎల్‌కు నోటీసులు
జూనియర్ లైన్‌మెన్ల నియామకాల్లో సర్వీసు లెక్కింపు వివరణ ఇవ్వాలంటూ ఎన్‌పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఎస్‌ఈ, డివిజనల్ ఇంజనీర్లకు హైకోర్టు నోటీసు లిచ్చింది. 2009 నవంబర్ 10న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నియమితులైన వారందరికీ ఒకే సీనియారిటీ వర్తింపజేయ లేదంటూ 2011లో నియమితులైన వందల మంది 12 పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారణ చేపట్టారు. ఒకే నోటిఫికేషన్ ఆధారంగా 2007లో కొందరు, 2011లో కొందరు నియమితులయ్యారనీ, అందరినీ 2007లో నియమితులైన వారితో సమానంగా సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే వేతనాలు, పదోన్నతులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. అందుకు విరుద్ధంగా 2011లో నియమితులైనవారిని సర్వీసులో జూనియర్లుగా పేర్కొంటు న్నారని తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదన లు వినిపిస్తూ… 2007లో ప్రకటించిన ఖాళీల మేరకు పోస్టులను భర్తీ చేశామన్నారు. అనంతరం 2011లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా పిటిషనర్లను నియామకం జరిగి నప్పటి నుంచే సర్వీసు ప్రారంభమవుతుందని తెలిపారు. వాదనలను విన్న హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆరు వారాలకు విచారణను వాయిదా వేసింది.
హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES