Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొల్లాపూర్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం

కొల్లాపూర్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – కొల్లాపూర్
సెప్టెంబర్ 17న కొల్లాపూర్ మండలం, మూలచింతలపల్లి గ్రామానికి చెందిన చిరుముని బాలరాజు యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడానికి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ అధికారి ఎస్హెచ్ఓ రుషికేశ్ అలాగే మరో ఇద్దరూ కానిస్టేబుల్స్ కనీసం మానవత్వం మరిచి, ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన బాదితున్ని అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తోలు బెల్ట్ అలాగే బూటు కాలుతో లాఠీలతో ఇష్టారీతిన దాడిచేసి, హత్యాయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ అలాగే తెలంగాణ రాష్ట్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరూ స్పందించకపోవడంతో, ప్రాథమిక హక్కులకు తీవ్రమైన భంగం కలగడంతో న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్.31256/2025 దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై, అలాగే కానిస్టేబుల్ లపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా ది.17/09/2025 తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ భద్రపరిచి, పూర్తి విచారణ జరిపి హై కోర్టుకు విచారణ నివేదిక సమర్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించారని సంబంధిత బాధితుడి న్యాయవాది వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -