- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి:
మండలంలో ని ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి ఎన్ నరసింగరావు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సన్మానించి, స్వామి వారి జ్ఞాపకతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జడ్జి లు సిహెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్, సుధాకర్, ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -