- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్ ట్రైబ్యునల్‌కు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌కూ నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఇద్దరిపై స్పీకర్ ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాదించారు. స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని వాదించారు. కడియం, సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
- Advertisement -



