Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌

హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌

- Advertisement -

ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సుజరు పాల్‌ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ సింగ్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యే ముందు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -