Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉన్నత లక్ష్యాలే విజయానికి మార్గం

ఉన్నత లక్ష్యాలే విజయానికి మార్గం

- Advertisement -

ఎంబీఆర్ ట్రస్ట్ అధినేత మామిడి బాల్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్ 

ఉన్నత లక్ష్యాలే విజయానికి మార్గం విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి. నేటి విద్యార్థులే రేపటి తెలంగాణకు దిశానిర్దేశకులు అని 1977- 1978 పూర్వ విద్యార్థులు,ఎం.బీ.ఆర్ ట్రస్ట్ అధినేత మామిడి బాల్ రెడ్డి, దిశ కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థులు నైపుణ్యత శిక్షణ క్రమశిక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ, డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని వారు సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.

విజయం ఒక్కసారిగా లభించేది కాదని, ప్రతిరోజూ చేసే కృషే భవిష్యత్‌కు పునాదిగా మారుతుందని పేర్కొన్నారు. వైఫల్యాలను భయపడకుండా, వాటిని అనుభవాలుగా మలుచుకొని ముందుకు సాగితేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఉన్నత ఆశయాలతో చదువును ఆయుధంగా మలుచుకుంటే వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని వారు స్పష్టం చేశారు. అలాగే ఎంబీఆర్ ట్రస్టు ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను, ఎంబిఆర్ ట్రస్ట్ అధినేత మామిడి బాల్ రెడ్డి నీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1977-1978 బ్యాచ్ పూర్వ విద్యార్థులు జూకంటి నరేందర్ రెడ్డి, అనాజిపూర్ నరసింహారెడ్డి, మోహన్ రావు, రాజయ్య, అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -