నవతెలంగాణ – మునిపల్లి :
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని పెద్ద గోపులారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు సాయంత్రం జరిగిన పాఠశాల వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భీంసింగ్, పెద్ద గోపులారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, గ్రామ సర్పంచ్ మల్లేశం , రాయికోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పాండు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు చంద్రమౌళి,లక్ష్మణ్ మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



