Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం

- Advertisement -

ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని బంజేరిపల్లి గ్రామంలో బాణాల శంకర్ రెడ్డి ఆయిల్ ఫామ్ లో  రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రతి 15 రోజులకొకసారి గెలలను కోయడం జరుగుతుందని, ఒక ఎకరానికి దాదాపు రూ 1.50 వేల నుండి రూ 2లక్షల  నికర ఆదాయం పొందవచ్చన్నారు. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చని రైతులకు సూచించారు.

ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుంటుందని పంట నష్టం ఉండదన్నారు.దళారీ వ్యవస్థ సంబంధం లేకుండా నేరుగా అమ్ముకోవచ్చని వివరించారు..ఈ నెల నుంచి రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జిలను కూడా చెల్లిస్తుందని తెలిపారు. రైతులు ఎరువులు, నీటియాజమాన్యం పై సమగ్రంగా వివరించారు. ఆయిల్ పామ్ పంటకు డ్రిప్ సబ్సిడీ మరియు పెట్టుబడి సహాయం క్రింద ఎకరానికి రూ. 4200/- సంవత్సరానికి ఇస్తుందని తెలిపారు.కావున రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పూజ, ఆయిలఫెడ్ క్షేత్ర సిబ్బంది రాములు, రవళి,వేణు  రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img