సహాయక చర్యలు ముమ్మరం చేయండి.. యంత్రాంగం తీరు బేష్
మెదక్ జిల్లా వరద ప్రాంతంలో
సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని హవేళీఘన్‌పూర్ మండలంలో జరిగిన వరద నష్టాన్ని గురువారం సాయంత్రం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ ల్యాండ్ అయిన తర్వాత కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు, ఎమ్మెల్యేలతో వరదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్దం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వరద నష్టాల అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవల్ బ్రిడ్జిలు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఏరియల్ వ్యూ ద్వారా వరదల్ని పరిశీలించిన సీఎం.. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా నష్టాన్ని స్వయంగా చూశారు. జిల్లాల్లో యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్‌ప్లే చేస్తున్నామని రైతులకు రాబోయే పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని, నానో యూరియాపై రైతులకు అవగహన కల్పించాలని అన్నారు. సీఎం పర్యటనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు, కలెక్టర రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
శాశ్వత ప్రాతిపదికన హైలెవల్ బ్రిడ్జిలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES