నవతెలంగాణ – ముధోల్
ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల కు అధిక లాభాలు వస్తాయని బైంసా డివిజన్ ఉధ్యనావన అధికారి ఎస్ కే జావిద్ పాషా అన్నారు. మండలం లోని తరోడా గ్రామ రైతు వేదిక లో వ్యవసాయ ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు. మొక్కలకు రాయితీతో పాటు, నాలుగేళ్లకు రూ. 4200 చొప్పున ఏటా అంతర, యాజమాన్య పంటల ఖర్చులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
డ్రిప్ ఇరిగేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు 100%, బీసీలకు 90% రాయితీలు అందిస్తోందని అన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో 30 ఏళ్లు నికర ఆదాయం పొందవచ్చని, ఆసక్తి ఉన్న రైతులు ఎకరాకు 50 మొక్కలకు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కూరగాయ సాగు చేసే రైతులు విత్తన శుద్ధి పాటించాలని తద్వారా పురుగు మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలియజేశారు. కూరగాయ రైతులు డ్రిప్పు మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తే కూలీల ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని సూచించారు .ఆసక్తిగల కూరగాయ సాగు చేసే రైతులు డ్రిప్పు పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఇఓ రాణి, పంచాయతీ సెక్రెటరీ, రైతులు తదితరులు, పాల్గొన్నారు.
ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES