– బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్‌లతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని ఆయన ఈ సందర్భంగా కమిటీని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు, అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపర్చాలని కోరారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్షించి చర్యలు తీసుకుంటారని పొన్నం వెల్లడించారు.
గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఉన్నతాధికారుల కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES