Wednesday, October 22, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య

- Advertisement -

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి…
పాఠశాల తనిఖీ చేసిన ఇన్చార్జి డిఈఓ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఇన్చార్జి డిఇఓ వినోద్ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.తరగతి గది పరిశీలించి పాఠ్యప్రణాళిక పరిశీలించి డైరీ, రిజిస్టర్లు రికార్డులను  పరిశీలించారు. విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి వారితో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు విద్య బోధనలు అందించాలన్నారు. పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -