Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంతీవ్ర సంక్షోభంలో ఉన్నత విద్యారంగం

తీవ్ర సంక్షోభంలో ఉన్నత విద్యారంగం

- Advertisement -

– బి.జి.దేశ్‌ముఖ్‌ స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్‌ దీపక్‌ నాయర్‌
న్యూఢిల్లీ :
భారతదేశంలో ఉన్నత విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు దీపక్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభా నికి నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని విమర్శించారు. 2014 నుంచి విశ్వవిద్యాల యాల్లో రాజకీయ జోక్యం, ప్రభుత్వ ప్రమేయం పెరిగిపో తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019 నుండి ఈ పరిస్థితి మరింత ఉధృతమైందన్నారు. ”భారతదేశంలోని ఉన్నత విద్యా రంగంలో సంక్షోభం : కల్లోపరుస్తున్న వర్తమానం, ఆందోళన కలిగిస్తున్న భవిష్యత్‌” అనే అంశంపై బుధవారం బి.జి.దేశ్‌ముఖ్‌ స్మారకోప న్యాసం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా ర్ధులకు తగిన అవకాశాలు వుండడం లేదని అన్నారు. వున్న విద్యా సంస్థలు కూడా ప్రమాణాలకు తగిన రీతిలో పనిచేయడం లేదన్నారు. కొన్ని విద్యా సంస్థలు సగటు సామర్ధ్యాలు వున్న విద్యార్ధులకు కూడా ఉపయోగ పడే రీతిలో వుండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్య, పరిశోధనా రంగాల్లో నాణ్యత బాగా క్షీణించిపోయిందన్నారు. విశ్వవిద్యాలయాలపై రాజకీయ నియంత్రణ పెరిగిపోతోందని అన్నారు. నిధులకు సంబంధిం చిన నిర్ణయాల దగ్గర నుండి ఫ్యాకల్టీ నియామకాల వరకు కూడా అంతా రాజకీయ నేతల ప్రమేయంతోనే సాగుతోం దన్నారు. దీనివల్ల విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి తుడిచిపెట్టుకుపోతోందన్నారు. యూనివర్శిటీల్లో, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకాలు ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత భావజాలానికిఅనుగుణంగా జరుగుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదన్నారు. ప్రతిభ, నైపుణ్యాల కన్నా కేవలం రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యతని స్తోందని ప్రొఫెసర్‌ నాయర్‌ విమర్శించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కింద అడ్మిషన్ల ప్రక్రియలు కేంద్రీకృతమవడాన్ని ఆయన విమర్శించారు. ఎన్‌టీఏకు పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా పోతోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -