ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నవతెలంగాణ – ముధోల్: వ్యవసాయంపై అవగాహనతో పంటల సాగులో నాణ్యమైన ఉత్పత్తులను,అధిక దిగుబడులు సాధించవచ్చని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలం లోని వెంకటా పూర్ గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా మట్టి నమూనా పరీక్ష లు చేయించుకోవాలని సూచించారు సేంద్రియ ఎరువులతోని అధిక దిగులు సాధించవచ్చని పేర్కొన్నారు అధిక యూరియా వాడుతున్నారని దీంతో భూమి సారం కోల్పోతుందని అన్నారు. కెపాసిటీ మించి రసాయన ఎరువులు వాడకూడదని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన సలహా సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాదించాలని అన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వలన భూసారం పెరగడంతో పాటు రైతుకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని పేర్కొంన్నారు. అలాగే ఏరువాక ,వ్యవసాయ పరిశోధనా స్థానం ముధోల్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నర్సయ్య మాట్లాడుతూ రైతులు భూమిని కాపాడాలని పేర్కొన్నారు. ఎక్కువ రసాయన ఎరువులతో పాటు యూరియా వలన భూమిలోని సారమంత కోల్పోయి నిర్జీవంగా మారుతుందని దీంతో దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు తాము సూచించిన సలహా సూచన లు పాటిస్తూ అధిక దిగుబడును పొందాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం భృహత్తర కార్యక్రమం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలన్నే కార్యక్రమం శ్రీకారం చుట్టిందని అన్నారు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, డిఎఓ అంజిప్రసాద్,ఆర్టికల్చర్ జిల్లా అధికారి రమణ,ఎడిఎ వినయ్ బాబు,శాస్త్రవేత్తలు డా.విజయ్ కుమార్,డా.కార్తీక్,జావిద్ బాషా, నాయకులు నర్సగౌడ్, కోరి పోతన్న,టి రమేష్,దేవోజి భూమేష్,సురేందర్ రెడ్డి,సాయినాథ్,రామ్ నాథ్, రైతులు తదితరులు, పాల్గొన్నారు.
అవగాహన సాగుతో అధిక దిగుబడులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES