కేదార్ నాధ్ లో మృతి చెందిన అశ్వారావుపేట వాసి…
నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట కు చెందిన డబ్బాల వ్యాపారి గుత్తికొండ వెంకటేశ్వరరావు(47) కేదార్ నాధ్ యాత్రకు వెళ్లి సోమవారం రాత్రి గుండెపోటుకు గురయి మృతి చెందాడు. సహ యాత్రికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట కు చెందిన ఆరుగురు భక్తులు ఈనెల 1 న కేదార్ నాధ్ యాత్రకు వెళ్లారు. మార్గం మద్యలో అయోధ్య, ప్రయాగ రాజ్, అలహాబాద్, ఢిల్లీ,హరిద్వార్ దర్శించుకుని సోమవారం ఉదయం కేదార్నాథ్ క్షేత్రానికి క్రింది భాగంలోని గౌరీ కుండ్ కు చేరుకున్నారు.అక్కడి నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు కాలినడకన పర్వతారోహణం చేస్తూ కేదార్నాథ్ క్షేత్రానికి 17 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. ఈయనతో పాటు కొందరు భక్తులు గుర్రాలపై,డోలీ ల పై చేరుకున్నారు.నిత్యం మార్గమధ్యంలో ఉండే ఆస్పత్రుల లో రక్తపోటు,ఇతర పరీక్షలు ఉచితం చేసేవారని, ఈ సోమవారం భక్తులను ఎవరూ ఆప లేదని, కనీసం వెంకటేశ్వరరావు కూడా ఆయాస పడుతున్నా,ఉచిత పరీక్షలకు మొగ్గు చూపకుండా పర్వతారోహణం చేసి యాత్ర పూర్తి చేసినట్లు సహ యాత్రికులు చెబుతున్నారు. సోమవారం రాత్రికి కేదార్ నాధ్ క్షేత్రానికి దరిదాపులకు చేరుకున్న అశ్వారావుపేట కు చెందిన సహ యాత్రికులతో పాటు టెంట్ లో భోజనం చేసి వెంకటరత్నం అందరితో పాటు నిద్రించాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకానికి చేరుకోవాలని నిద్రలేపేందుకు ప్రయత్నించగా వెంకటేశ్వరరావు స్పందించక పోవడంతో సమీపంలోని వైద్యులకు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి నట్లు చెప్పారు. విషయాన్ని మిలటరీ అధికారులకు తెలియజేయగా హెలికాప్టర్ సహాయంతో గౌరీ కుండ్ కు మృతదేహాన్ని తరలించారు.
కాలినడకన పర్వతారోహణం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES