నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ..ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆదేశ విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.
నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధం: చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES