Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంహిందీకి స్థానం లేదు

హిందీకి స్థానం లేదు

- Advertisement -

– బలవంతంగా రుద్దేందుకు అవకాశం ఇవ్వం : తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌
చెన్నై :
హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు గతంలోనూ అవకాశం ఇవ్వలేదనీ, ప్రస్తుతం కూడా ఇవ్వబోమని, భవిష్యత్‌లోనూ అసలు ఆ అవకాశమే లేదని తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌ స్పష్టం చేశారు. భాషా వీరుల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ బలవంతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఇకపై ఒక్క ప్రాణం కూడా కోల్పోవాల్సిన అవసరం రాకూడదని అన్నారు. తమిళుల భాషా భావోద్వేగం ఎప్పటికీ చావదనీ, హిందీ బలవంతానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన వివరించారు. దేశంలో తన భాషను ప్రాణంలో ప్రేమించే ఏకైక రాష్ట్రం తమిళనాడేనని వ్యాఖ్యానించిన స్టాలిన్‌.. ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ఐక్యంగా నిలిచి హిందీ విధింపును తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అలాగే భారత ఉపఖండంలోని అన్ని భాషా కుటుంబాల హక్కులు, గుర్తింపును తమిళనాడు కాపాడిందని చెప్పారు. హిందీ విధింపును వ్యతిరేకిస్తూ తమ ప్రాణాలను అర్పించిన భాషా వీరులకు ఆయన ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -