Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐక్యతకు హిందీ భాష ప్రతినిధి 

ఐక్యతకు హిందీ భాష ప్రతినిధి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
స్వాతంత్రం అనంతరం ఐక్యతకు హిందీ భాష ప్రతినిధిగా నిలిచిందని బమ్మెర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి అన్నారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని బమ్మెర ఉన్నత పాఠశాలలో హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీని అధికారిక భాషగా స్వీకరించిందని తెలిపారు.

దేవనాగిరి లిపిలో వ్రాయబడిన హిందీ దేశ అధికారిక భాషగా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హిందీ భాషను నేర్చుకోవాలని సూచించారు. హిందీ భాషా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థిని,  విద్యార్థులకు క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయం, పాటల పోటీలు, నృత్య ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందీ  అధ్యాపకురాలు నూర్జహాన్ బేగం, ఉపాధ్యాయులు రామ్మోహన్రావు, ,వెంకటేశ్వర్లు, నరసింహస్వామి ,యాకూబ్ పాషా ,స్వామి, లావణ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -