నవతెలంగాణ- హైదరాబాద్: కన్జర్వేటివ్ పార్టీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ జర్మనీ నూతన ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియ ఊహించినంత సజావుగా సాగలేదు. తొలి విడత ఓటింగ్‌లో ఆయన మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. యుద్ధానంతర జర్మనీ చరిత్రలో ఒక ఛాన్సలర్ అభ్యర్థి మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. అంతకుముందు, జర్మనీకి పదో ఛాన్సలర్‌గా మెర్జ్ సునాయాసంగా గెలుపొందుతారని అంతా భావించారు. కానీ, మొదటి రౌండ్ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఈ చారిత్రక వైఫల్యం తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిర్వహించిన రెండో విడత ఓటింగ్‌లో ఫ్రెడ్రిక్ మెర్జ్ విజయం సాధించారు. మొత్తం 630 ఓట్లకు గాను, ఆయనకు అనుకూలంగా 325 ఓట్లు లభించాయి. దీంతో ఛాన్సలర్ పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ ఆయనకు దక్కింది.
జర్మనీ రాజకీయాల్లో చారిత్రక పరిణామం
- Advertisement -
- Advertisement -