- Advertisement -
బతుకమ్మ అంటే పండుగే అందరికీ
రంగురంగుల పూలే అందరికీ కానీ
రజాకార్ల ముంగిట నగంగా
బతకలేని పువ్వుల గుర్తులు కూడా…
పండుగంటే పండుగేకాదు ఇది ఒక చరిత్ర…
ఇది సీత స్వయంవరం కథ
ఇది రాముడు విల్లు విరిచినకథ
ఇది ఒక కష్ణుని గీతకథ
పూలరంగులు నేడు కొత్తపుంతలు తొక్కి
ఆడబిడ్డల మానప్రాణాలతో చెలగాటాలాడి
అవహేళన చేసిన దొరల గడీలు నేలకూలగా
ఉషోదయ కిరణాలు జనుల గుండెల్లో
కొత్త కాంతులు నింపగా
పూరిగుడిసెల ముంగిళ్ళలో ఇంద్రధనస్సు
నవ్వుల ముగ్గులు వేసింది
పల్లెజనుల పూర్వపు ఆటవిడుపు మనపాట
చరిత్రదాచిన సంస్కతినిచూపే పూలపండుగే
బతుకమ్మ ఇది మనబతుకమ్మ
ఇదే మనబతుకమ్మ
- వంగీపురం ప్రవీణ, 8074373367
- Advertisement -