మొన్ననే క్రిస్మస్ వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఒక 15,20 ఏండ్ల కిందట అయితే గ్రీటింగ్స్ కార్డుల సీజన్ వచ్చేసిందనుకునే వాళ్ళం. కానీ మారిన సాంకేతిక పరిణామాల లో భాగంగా మనం ఇప్పుడు సెల్ ఫోన్ లోనే అందమైన బొమ్మలు పంపుకుంటూ క్రిస్మస్ ,న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం
మనిషికి మనిషికీ మధ్య మనసులతో పెనవేసుకుని అల్లుకుపోయిన ఆత్మీయతానుబంధాలను పరస్పరం బలోపేతం చేసుకోవడానికి ఆయా సందర్భాలలో ఒకరికొకరు సుదూర తీరాల్లో ఉన్నా అభివ్యక్తీకరించే శుభాకాంక్షలను అందజేసే మైత్రీ సందేశికలు ”గ్రీటింగ్ కార్డులు”. కొత్త సంవత్సరం 2026 రాబోతున్నది. కానీ గ్రీటింగ్ కార్డుల సందడి ఎక్కడా కానరావడం లేదు.ఐతే ఈ గ్రీటింగ్ కార్డులకు సుమారు 225 ఏండ్ల చరిత్ర ఉంది. 1800లో గ్రీటింగ్ కార్డును తొలత రూపొందించిన ఘనత ”వ్యాలెంటేసర్’కి దక్కుతుంది. అయితే తొలి క్రిస్టమస్ కార్డును 1843లో జె.సి. హర్సిలీ తయారు చేశాడు. కానీ అమ్మకానికి ఈ గ్రీటింగ్ కార్డులు 1847 మార్కెట్లోకి వచ్చాయి.
అసలు ఈ గ్రీటింగ్ కార్డు ఎలా పుట్టింది? ఎవరు శ్రీకారం చుట్టారు? ఐరోపా దేశములలో క్రైస్తవ మత ప్రారంభం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునే ఆచారం ఉంది. అయితే శుభాకాంక్షలు తెలిపే పత్రానికి ‘గ్రీటింగ్’ కార్డ్’ అని పేరు పెట్టి, దానిని తయారు చేసిన వ్యక్తి జరుసలేంకు చెందిన జె.సి హార్సిలీ. ఆయన 1943లో అట్టపై పశువుల శాలలో పడుకున్న క్రీస్తును చిత్రించి దాని అడుగున ‘మెర్రీ క్రిస్టమస్ అండ్ హ్యాపీ న్యూయర్’ అని తెలిపే కార్డులను వెయ్యి తయారు చేయించాడు. ఇంకా రెవరండ్ ‘ఎడ్వర్డ్ బ్రాచీ’ అనే ఫాదర్ గ్రీటింగ్ కార్డును మొదటిసారిగా ప్రింట్ చేయించారంటారు.అవి అప్పట్లో సంచలనం సష్టించాయి. అయితే బ్రాచీ గ్రీటింగ్ కార్డును ఎప్పుడు ముద్రించాడో తెలియదు కానీ, కొందరు 1942లో ‘సర్ రోజర్ డీ కవర్’ అతనుమొదట గ్రీటింగ్ కార్డును ముద్రించాడని కూడా అంటారు.. దీనిపై దీనిపై బొమ్మ, గ్రీటింగ్ కాప్షన్ ను ముద్రించాడు. ఈ కార్డు ఇప్పటికి బ్రిటీష్ మ్యూజియంలో భద్రంగా వుంది . ఇలా మొత్తం మీద గ్రీటింగ్ కార్డులు ఇంగ్లండ్లోనే పుట్టాయి.
అయితే వ్యాపార సరళిలో ఈ గ్రీటింగ్ కార్డులు అమ్మకానికి మార్కెట్లో 1948లో ప్రవేశించాయి. 66సంవత్సరాల కాలంలో గ్రీటింగ్ కార్డులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలను ప్రతిబింబించే విధంగా పలు రకాలైన మార్పులు, చేర్పులు చెందాయి. మతపరమైన భావాలకు బదులుగా సామాజిక స్నహ, కళాభినివేశం ప్రయోగవాదం చోటుచేసుకున్నాయి.
మన దేశంలో ఈ గ్రీటింగ్ కార్డుల ముద్రణ 50 సంవత్సరాల క్రింద మొదలెట్టింది వకిల్సీ అనే ముద్రణా సంస్థ.మన దేశంలో తయారైన గ్రీటింగ్ కార్డులు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలికినవి. ఇక తెలుగునాట 1978 నుండి గ్రీటింగ్ కార్డుల ముద్రణ మొదలైంది. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ వారి అభినందన గ్రీటింగ్ కార్డు బహుళ జనాదరణ పొందినవి. ఇతర దేశాలకు సైతం వెళ్లి మన గ్రీటింగ్ కార్డులో మన తెలుగు సంస్కతి, కళలను ప్రతిబింబించే విధంగా బాపు వంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలను వాడేవారు.
30 సంవత్సరాల క్రితం నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డ్స్ కొన్ని పుస్తకాల షాపుల్లో ఒక మూల బాక్స్ లో వుంచి, అడిగిన వారికి చూపించి అదో పక్క చిన్న వ్యాపారంగా చూపేవారు. కొన్ని కొన్ని పట్టణాల్లో కాస్త పెద్ద ఎత్తున కార్డ్స్ అమ్మకానికి వుండేవారు. ఒక మూలగా వున్న ఈ వ్యాపారం తరువాత నగరాలు, పట్టణాలు, గ్రామాల వరకు పెరిగిపోయింది. అందర్ని విశేషంగా ఈ గ్రీటింగ్ కార్డులు ఆర్జించేవి.
అమెరికాలో 1931లో గ్రీటింగ్ కాగితం, గ్రీటింగ్ కార్డ్ రూపంలోకి వచ్చింది. చైనాలో 18వ శతాబ్దంలోనే హ్యాండ్ మేడ్ పేపర్ తో తొలుత గ్రీటింగ్ కార్డులు తయారు చేసారని చెబుతారు. తరువాత ఈజిప్టు, బ్రిటన్, అమెరికాలలో వీటికి ఆదరణ వచ్చిందనేది గ్రీటింగ్ కార్డుల చరిత్ర చెబుతున్నది. పలు దేశాలలో తొలి రోజులలో వీటిని ఆదరించారు. అమెరికాలో గ్రీటింగ్ కార్డ్స్ అసోసియేషన్ ఒకటి ఉండటం గమనార్హం.
మనదేశంలో అవిభక్త భారతదేశంలో 1941లో కరాచీ వి.టి. కంపెనీ అమెరికా నుంచి గ్రీటింగ్ కార్డ్స్ దిగుమతి చేసుకొని దేశంలోని ప్రధాన నగరాలలో విక్రయించడం చేసింది. 1947లో దేశ విభజన అనంతరం వి.టి. కంపెనీ కరాచీ నుంచి బొంబాయికి తన వ్యాపారాన్ని మార్చుకొని గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారం ప్రారంభించింది. ఆ తరువాత వీకీల్స్, ఎల్.ఆర్.సుందర్ కం పెనీలు కూడా గ్రీటింగ్స్ వ్యాపారం ప్రారంభించాయి.
గ్రీటింగ్ కార్డ్స్ లో విశేషంగా మార్పులు సంభవించింది. 1970 ప్రాంతంలోనే, 1979లో ఢిల్లీలోని జనపదలో ఒక ఇంటిలో పోస్టర్స్ గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముకుని చిన్న షాపు గ్రీటింగ్స్ తో ప్రారంభించి.. ఇద్దరు సోదరులు 1985లో ‘అర్బన్ గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీ ఏర్పాటు చేసి మార్కెట్లోకి దిగారు. ప్రారంభించిన మూడు. సంవత్సరాలలోనే సంవత్సరానికి రూ.12 లక్షల వ్యాపారం వేయగలిగారు. వారు గ్రీటింగ్ కార్డ్స్ రూపాన్ని మార్చి, అంతకు ముందున్న చౌక రకం పేవర్ బోర్డు, పువ్వుల బొమ్మలు కాకుండా. నాణ్యమైన బోర్డుపై మేటర్స్ తో కార్డులు వేసి మార్కెట్లోకి దింపారు. గ్రీటింగ్ కార్డ్స్ తో పాటు పోస్టర్స్ సినిమా నటులవి. క్రికెటర్లవి, హాలీవుడ్ నటులవి, క్రీడాకారులని వివిధ సైజులలో మార్కెట్లోకి తీసుకువచ్చి మొత్తం వ్యాపారాన్ని మార్చేసి, మిగతా కంపెనీల వారు వీరిని అందుకోలేనంత వేగంతో మార్కెట్లో స్థానం సంపాదించ గలిగారు. ఇంక 1987 – 88 నుండి దాదాపు అన్ని గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీలు తమ కార్న్ వివిధ అందమయిన డిజైన్లతో పోటీపడినవి.
దేశమంతా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వండలాది రిప్రజెంటేటివ్ లను ,కమిషన్ ఏజెంట్లను నియమించి, అందమయిన ఆల్బమ్స్ తయారు చేసి ఏటా ప్రతి రెండు నెలలకు వారిని మార్కెట్లోకి పంపించి తమ వ్యాపారాన్ని పెంచుకున్నది.
1988 ఆర్చస్ కంపెనీ మరొక అడుగు ముందుకు వేసి దేశంలోని ప్రధాన నగరాలలో వారి కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులతో గ్యాలరీలు ప్రారంభించింది. ఒకో గ్యాలరీకి 5 నుంచి 15 లక్షలు కేవలం డెకరేషన్ కే ఖర్చు పెట్టింది. గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారం షోరూమ్స్ తో రావడంతో యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాదులో 24 షోరూమ్ లు, విజయవాడలో 2, గుంటూరులో 1, వైజాగ్లో 2 కేవలం గ్రీటింగ్ కార్డ్వే ఉండేవి. అంతేగాక, బుక్ స్టాల్స్ లో కూడా విరివిగా అమ్మేవారు. ఇప్పుడు ఇలాంటివి అక్కడక్కడ కనిపిస్తాయి.
ఇప్పుడు గ్రీటింగ్ కార్డులను ప్రభుత్వం లోని వివిధ హౌదాలలో ఉన్న ప్రధాన మంత్రి ,కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రివర్గంలోని సభ్యులు ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు మాత్రం గ్రీటింగ్ కార్డ్స్ క్రిస్టమస్‌తో ప్రారంభమై నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించి పంపిస్తూ ఉంటారు.
యునిసెఫ్ కార్డులదొక చరిత్ర
‘జిట్కా సమకోవా’ అనే పూర్తి పేరు గల ఈ చిన్నారి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తమ గ్రామ ప్రజలకు ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడిన వారికి కతజ్ఞతలు తెలుపుతూ తనకు తోచినట్లుగా ‘శాంతి సమయంలో సంతోషం విరిసిన వేళ’ అనే భావనతో వేసిన బొమ్మను చూసిన జిట్కా టీచర్ ‘జోసెఫ్ ఇ బర్టోస్కా’ ముచ్చటపడి తన బడి పిల్లలు వేసినవే మరో ఎనిమిది చిత్రాలను కలిపి యునిసెఫ్ వారికి పంపింది. వీటిలో అక్కడి అధికారులు జిట్కా వేసిన చిత్రాన్ని ఎంపిక చేసి తమ సంస్థ క్యాలండర్లో ముద్రించి తమ దేశంలోని అన్ని కార్యాలయాలలో వ్రేలాడదీశారు.
ఇది తెలుసుకున్న యునిసెఫ్ న్యూయార్క్ కార్యాలయం వారు 1949లో జిట్కా బొమ్మని గ్రీటింగ్ కార్డుగా ముద్రించి తమ కార్యాలయంలోని ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేలా అమ్మకాలు చేశారు. విడుదలైన తొలిరోజే ఈ కార్డులన్నీ అమ్ముడై నాటి నుంచి యునిసెఫ్ డైరెక్టర్ ‘మారిన్సెట్ పై కార్డుల ప్రచురణకు వత్తిడి పెరిగింది. దాంతో 1951లో వీటి ముద్రణకై నాలుగు వేల డాలర్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఆ ఏడు ముద్రించిన లక్షా అరవై వేల కార్డులపై 16, 274 డాలర్లు ఆదాయం వచ్చింది. అలా హాట్ కేకుల్లా అమ్ముడైన గ్రీటింగ్ కార్డుల ముద్రణకు 1952లో ఒక ప్రత్యేక డైరెక్టర్గా ‘నోరా ఎడ్మండ్స్ ‘ ని నియమించారు.అలా చిన్నారి జిట్కా వేసిన బొమ్మ ఇనసిప్ గ్రీటింగ్ కార్డుల పుట్టుకకు కారణమై గ్రీటింగ్ కార్డుల ఉద్యమానికి ఊపిరి పోసింది. అలా జిట్కా వేసిన బొమ్మే యునిసెఫ్ వారి తొలి గ్రీటింగ్ కార్డుగా ముద్రితమైంది. కాలక్రమంలో దేశదేశాలలో వుండే ప్రసిద్ధ చిత్రకారుల నుండి పెయింటింగ్స్ ని ఆహ్వానించి ముద్రించడం మొదలు పెట్టారు. ఈ యునిసెఫ్ గ్రీటింగ్ కార్డుల ఎంపిక వినూత్నంగా వుంటుంది. మొదటి సంవత్సరం జూన్ లో యునిసెఫ్ ఆర్ట్ సెలక్షన్ కమిటీకి అంతర్జాతీయ చిత్రకారులు తమ డిజైనులను అందజేస్తారు. వీటి ఎంపికలో యునిసెఫ్ బాలల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసి ముద్రణకు ఆమోదిస్తారు. ఇందుకు రెండేళ్లు పడుతుంది. మూడో సంవత్సరంలో ముద్రించి ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై దేశాల్లో విక్రయిస్తారు. వీటిని ఐక్యరాజ్యసమితి గుర్తించిన మూడు అధికార భాషల్లో ముద్రిస్తారు.
యునిసెఫ్ వారి గ్రీటింగ్ కార్డులలో స్త్రీ శిశు సంక్షేమం, కుటుంబం, పిల్లలు, వారి అభివద్ధి, అక్షరాస్యత, ప్రపంచ శాంతి, సోదరభావం, సాంస్కతిక వారసత్యాల, పర్యావరణం, మెరుగైన జీవనానికి తోడ్పడే వాతావరణం, యువతరం, మానవ విలువలు, పండుగలు, నూతన సంవత్సర శు భాకాంక్షలు వంటి విభిన్న అంశాలు ప్రధానంగా చోటుచేసుకుంటాయి. 1992లో 150 మిలియన్ వరకు యునిసెఫ్ గ్రీటింగ్ కార్డులు అమ్ముడైనవి. అదే యేడు మన దేశంలో వీటి అమ్మకం వల్ల మూడు లక్షల నలభై శాతం ఆక్రమించింది. మన దేశానికి చెందిన జెమినీ రారు, భగవాన్ కపూర్, సుల్తాన్ ఆలీ, చున్తారు, మావలంకర్ వంటి వారి చిత్రాలు యునిసెఫ్ కార్డులుగా ముద్రితమైనవి. 150 దేశాల నుండి 2600 మంది చిత్రకారులు తమ చిత్రాలను ముద్రించేందుకు యునిసెఫ్ వారికి హక్కులిస్తున్నారు. వారిలో పికాసో, సెల్పాస్‌ఆర్ అలి, మార్బాగల్, జార్జియా ఓకెఫ్, జీన్ డబుఫెట్ వంటి హేమాహేమీలున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యునిసెఫ్ కార్డులు అమ్మకాల్లో మన దేశం ఆరో స్థానంలో వుంది. మన దేశానికి చెందిన అమర్నాథ్ సెగల్ ”ఫ్రూట్ ప్లేయర్” చిత్రం న్యూయార్క్ యునిసెఫ్ కార్యాలయంలో ప్రధానంగా కనిపించేలా ప్రదర్శించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. అయితే వీటి ముద్రణ మాత్రం ఆగిపోకుండా యేటా ముద్రించటం గొప్ప విషయం.
– వి. మాలతి ఆర్.



