– ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
– ఆసియా కప్ 2025 షెడ్యూల్
దుబాయ్ (యుఏఈ) : ఆసియా కప్‌లో దాయాదులు భారత్, పాకిస్తాన్ ముచ్చటగా మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9-28 వరకు జరుగనున్న ఆసియా కప్‌లో పొరుగు దేశాలు ఒకే గ్రూప్‌లో చోటు చేసుకున్నాయి. ఇటీవల ఢాకాలో ముగిసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఏజీఎంలో ఆసియా కప్ నిర్వహణ, షెడ్యూల్‌పై సభ్య దేశాలు చర్చించాయి. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆసియా కప్ మరోసారి పొట్టి ఫార్మాట్‌లో జరుగనుంది. ఈ మేరకు ఏసీసీ ప్రెసిడెంట్ మోషిన్ నక్వీ తెలిపారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్.. పాకిస్తాన్‌తో ఒప్పందం కారణంగా యుఏఈలో జరుగనుంది. మూడేండ్ల పాటు ఇరు దేశాలు తటస్థ వేదికపై తలపడాలని 2025 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఎనిమిది దేశాలు పోటీపడుతున్న ఆసియా కప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. భారత్, పాకిస్తాన్ సహా ఓమన్, యుఏఈలు గ్రూప్-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్‌కాంగ్, అఫ్గనిస్తాన్‌లు గ్రూప్-బిలో నిలిచాయి.
సెప్టెంబర్ 14న దాయాదుల పోరు :
ఆసియా కప్ 2025 ఫార్మాట్ ప్రకారం భారత్, పాకిస్తాన్‌లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశలో దాయాదులు సెప్టెంబర్ 14న ఢకొీట్టనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు.. ఫైనల్ బెర్త్‌ల కోసం పోటీపడతాయి. నాలుగు జట్లు ఇతర మూడు జట్లతో ఒక్కోసారి తలపడతాయి. దీంతో భారత్, పాకిస్తాన్ మరోసారి ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21న జరిగే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంటే.. ముచ్చటగా మూడోసారి ఢకొీట్టనున్నాయి. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడలేదు.
కుదిరితే మూడుసార్లు ఢీ
- Advertisement -
- Advertisement -