– డెవలప్‌మెంట్ అప్రూవల్స్ కోసం వెయిటింగ్ ఎలివేటెడ్ కారిడార్స్, అండర్‌పాస్‌ల నిర్మాణాల్లో వేగం
– ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి.. భవిష్యత్ లే అవుట్లు బిల్డింగ్ పర్మిషన్లలో పురోగతి
– మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ అందుబాటులోకి..
– డ్రాఫ్ట్‌పై 15 వ తేదీ వరకు అభిప్రాయ సేకరణ : సమావేశంలో హెచ్‌ఎమ్‌డీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్
నవతెలంగాణ-హైదరాబాద్ (హెచ్‌ఎమ్‌డీఏ)
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి డెవలప్‌మెంట్ అప్రూవల్స్ ఉంటే అభివృద్ధి పనులు చేయడానికి హెచ్‌ఎండీఏ సిద్ధంగా ఉందని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్స్, అండర్ పాస్‌లు, స్కైవేల నిర్మాణలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. గురువారం హెచ్‌ఎమ్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఏడాది ఆరు నెలల అభివృద్ధి పనులపై హెచ్‌ఎమ్‌డీఏ కమిషన్ మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిఫెన్స్ ఆండ్ ఆర్మీ పరిధిలోని 163 ఎకరాలను తీసుకుని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పాదచారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా స్కైవేలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జేఎన్‌టీయూ నుంచి ప్రగతినగర్ ప్రాంతంలో, కేపీహెచ్‌పీ ప్రాంతాల్లో ప్రస్తుతం రెండు స్కేవేలు నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ విధానం లో లే అవుట్లు చేస్తున్నామన్నారు. వందలాది ఎకరాల్లో లే అవుట్లు చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో ల్యాండ్ పూలింగ్ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా మన్నారు. ప్రస్తుతం ప్రతాప్ సింగర్‌లో లే అవుట్ చేశామని, లేమురులో లే అవుట్ నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ ప్లాట్లు ఆక్షన్‌లో పెట్టలేదన్నారు. చెరువులు, కుంటల పరిరక్షణలో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 గుర్తించినట్టు తెలిపారు. ఇందులో కొన్ని లోకేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తయి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గతంలో కంటే ఈ ఏడాది ఆరునెలల్లో బిల్డింగ్ పర్మిషన్లలో పురోగతి సాధించామన్నారు. 2023లో 1,361 అప్లికేషన్లకు అప్రువల్ ఇస్తే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.565 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆరు నెలల్లో 922 ఆప్లికేషన్లకు అప్రువల్ ఇవ్వడంతో రూ.519 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. భవిష్యత్ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి ప్రస్తుతం డ్రాఫ్ట్ వర్క్ పూర్తి చేశామని, కాపీ కూడా అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. డ్రాఫ్ట్‌పై ప్రజా అభిప్రా యాలను తెలియజేయాల్సి ఉందని తెలిపారు.
జులై 15వ తేదీ వరకు డ్రాప్ట్‌పై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చని సూచించారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. లేమూరు లే అవుట్‌లో ల్యాండ్ ఓనర్స్‌కి సంబంధించి ప్లాట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు కానీ పొజి షన్ చూపించలేదని.. రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వలేదని కమిషనర్‌ను ప్రశ్నించగా.. టెక్నికల్ సమస్యతో ప్లాటింగ్ నెంబర్ ఇవ్వడంలో జాప్యం జరిగిం దని, త్వరలో సమస్యను పరిష్కారి స్తామని బదులిచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ రెడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా టెండర్స్ ప్రక్రియపై ప్రశ్నించగా.. ఈ విషయం హైకోర్టులో ఉందని, త్వరలో ఆర్డర్ రానుందని, రాగానే పనులు వేగవంతం చేస్తామని కమిషనర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ల్యాండ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నట్టు చెప్పారు.