Monday, September 22, 2025
E-PAPER
Homeఆటలుహాకీ ఇండియా ముందంజ

హాకీ ఇండియా ముందంజ

- Advertisement -

3-2తో జపాన్‌పై గెలుపు

రాజ్‌గిర్‌ (బీహార్‌) : ఆసియా కప్‌ హాకీలో టీమ్‌ ఇండియా సూపర్‌-4 దశకు చేరుకుంది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై 3-2తో మెరుపు విజయం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు సార్లు గోల్స్‌ కొట్టగా.. మన్‌దీప్‌ సింగ్‌ నాల్గో నిమిషంలోనే గోల్‌తో ఖాతా తెరిచాడు. పెనాల్టీ కార్నర్‌లను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కవాబె జపాన్‌ తరఫున రెండు గోల్స్‌ కొట్టినా..ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్‌ గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు మాత్రమే సూపర్‌4 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశ ఆఖరు మ్యాచ్‌లో నేడు కజకిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -