Saturday, September 20, 2025
E-PAPER
Homeసినిమాఆస్కార్‌ ఎంట్రీకి 'హోమ్‌ బౌండ్‌'

ఆస్కార్‌ ఎంట్రీకి ‘హోమ్‌ బౌండ్‌’

- Advertisement -

‘ఆస్కార్‌ 2026’ ఎంట్రీకి బాలీవుడ్‌ సినిమా ‘హోమ్‌ బౌండ్‌’ అర్హత సాధించింది. ఈ సినిమా ‘ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో మన దేశం తరఫున ఎంపికైనట్టు ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎన్‌.చంద్ర శుక్రవారం తెలిపారు. ఆస్కార్‌ అవార్డుల కోసం ఈ ఏడాది ‘హోమ్‌బౌండ్‌’తో సహా దేశ వ్యాప్తంగా 24 సినిమాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. పోలీసు కావాలనే మత కలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుల, మత వివక్షకు వ్యతిరేకంగా ఓ ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటమే ‘హోమ్‌బౌండ్‌’ చిత్ర కథాంశం. నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి కూడా ఎంపికవ్వడం విశేషం. ఇషాన్‌ కట్తర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లోనూ పురస్కారాలను సొంతం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -