– పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసిన ట్రాఫిక్ సిబ్బంది
నవతెలంగాణ – కంఠేశ్వర్ : పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసి ట్రాఫిక్ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. గురువారం ఖలీల్ వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది కానిస్టేబుల్ చిన్నోళ్ల ఉదయ్, గోపాల్ లకు రోడ్డుపైన ఎవరో గుర్తు తెలియని వారు డబ్బులు పోగొట్టుకొని ఉన్న వాటిని బాధితురాలు వివరాలు తెలుసుకొని అట్టి బాధితురాలు సుజాత భర్త మధు నివాసం జ్యోతి నగర్ గ్రామం మాక్లూర్ మండలం వారికి 2 వేల రూపాయలను అందజేశారు.. వైద్యం నిమిత్తం వచ్చి డబ్బులు పోగొట్టుకున్న బాధితురాలికి తిరిగి నిజాయితీగా అట్టి పోగొట్టుకున్న డబ్బులు అందించగా బాధితురాలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా నిజాయితీగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఉదయ్, గోపాలులను ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు.
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



