- Advertisement -
85కు చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్ : హాంకాంగ్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 85కు చేరుకుంది. గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. హాంకాంగ్‌లోని తారు పో జిల్లాలో వేలాది మంది నివాసం ఉంటున్న టవర్లలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో గురువారం సాయంత్రానికి 85 మంది మరణించారు. 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరోవైపు ఈ ప్రమాదం తరువాత నుంచి ఇంకా సుమారు 280 మంది జుచూకీ తెలియడం లేదు. వీరి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నటుస్ణ అధికారులు తెలిపారు.
- Advertisement -



