- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
జాతీయ స్థాయి టోర్నమెంట్ కు ఎంపికైన చదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీ లక్ష్మి ని మంగళవారం స్థానిక ఫొటోగ్రాఫర్లు అసోసియేషన్ సభ్యులు తన గృహంలో ఘనంగా సన్మానించి మొక్కను అందజేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రంజన్, కార్యదర్శి పవన్,సీనియర్ ఫోటోగ్రాఫర్ వార రాము, షేక్ షఫీ,తడికమళ్ళ అభి లు అభినందనలు తెలిపి మరిన్ని విజయాలు సాధించాలని ఆశీస్సులు అందించారు.
- Advertisement -



