- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మారు మూల ప్రాంతమైన జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామనికి చెందిన జైపాల్ గ్రూప్ 3లో ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తూ ఇంటికి వచ్చిన సందర్బంగా గ్రామస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి అతి చిన్న వయసులో ఉద్యోగం సాధించడం గ్రామానికి కూడా ఎంతో గర్వకారణమన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోలుపోయిన జైపాల్ కు ఏరోజు కూడా తండ్రి లేని లోటు లేకుండా తల్లి పెంచిందన్నారు. ఈరోజు ఆ తల్లి ముఖారవిందం ఆనందభాష్పాలతో నిండిపోయిందన్నారు. గ్రామంలోని యువకులు జపాల్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
- Advertisement -



