- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ పదవీ కాలాన్ని పొడగించినందుకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహ న్ రావుకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాను అందజేశారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సహకార సంఘం పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
- Advertisement -