నవతెలంగాణ-హైదరాబాద్: ఆశా, అంగన్ వాడీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియాగాంధీ డిమాండ్ చేశారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆశా, అంగన్ వాడీ, సహాయకుల దీనస్థితిపై మాట్లాడారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల పాత్ర కీలకమైందని, మహిళాల సాధికారత కోసం పాటుపడే సర్వీసుల పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. వారి శ్రమకు తగ్గట్లుగా వేతనాలు అందించాలని, సకాలంలో జీతాలు అందజేశాయని చెప్పారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న వారికి అదనపు సిబ్బందితోపాటు ఆయా సర్వీసుల్లో నియమాకాలు చేపట్టాలని సూచించారు. “దేశవ్యాప్తంగా, ASHA కార్యకర్తలు రోగనిరోధకత, సమీకరణ, ప్రసూతి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమాన్ని చేపట్టారు, అయినప్పటికీ వారు తక్కువ గౌరవ వేతనం మరియు పరిమిత సామాజిక భద్రతతో స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారని తెలియజేశారు..
ఆశా, అంగన్‌వాడీల సమస్యలపై కేంద్రం దృష్టి సారించాలి: సోనియా గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



