నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, బి ఎల్ వో లకు అదనపు బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, బి ఎల్ వో లు అదనపు విధులకు గౌరవ వేతనం ఇవ్వడం లేదని బుధవారం రైతు వేదిక కార్యాలయంలో తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు, బి ఎల్ వో లు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటర్ల నమోదు, తొలగింపు, జాబితాలో మార్పులు, స్లిప్పుల పంపిణీ, ఇతర విధులు నిర్వహించిన గౌరవ వేతనం ఇవ్వడం లేదని వాపోయారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అదనపు విధులకు గౌరవ వేతనం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడీ టీచర్లు, బిఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు విధులకు గౌరవ వేతనం ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES