Friday, July 11, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యారంగ సేవలకు గౌరవ గుర్తింపు..

విద్యారంగ సేవలకు గౌరవ గుర్తింపు..

- Advertisement -

– యాదగిరి శేఖర్‌ రావుకు హోప్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ పురస్కారం
నవతెలంగాణ – కరీంనగర్‌
విద్యా రంగానికి చేసిన విశిష్ట సేవలకుగాను ప్రముఖ విద్యావేత్త, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజ్ఞావికాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌ రావుకు గౌరవ డాక్టరేట్‌ పురస్కారం లభించింది. అమెరికాలోని హోప్‌ థియోలాజికల్‌ యూనివర్సిటీ వారు ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. 30 ఏండ్లుగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కషి చేస్తూ, విద్యా రంగ బలోపేతానికి శేఖర్‌ రావు ఎనలేని సేవలు అందించారు.

ముఖ్యంగా కరోనా కాలంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో యాజమాన్యాల సహకారంతో నిత్యావసర సరుకులు అందించి వారికి అండగా నిలిచారు. నిరుద్యోగ భతి కోసం అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఎంతోమందికి ప్రయోజనం కలిగేలా చేశారు.ప్రయివేటు పాఠశాలల గుర్తింపు పదేండ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి ముందంజలో నిలిచారు. ఫైర్‌ సేఫ్టీ, బిల్డింగ్‌ నిబంధనలు, లైసెన్సుల విషయంలో యాజమాన్యాలకు నడక బాట చూపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకూ గురికాకుండా అటు అధికార పక్షంతోనూ, ఇటు విపక్షాలతోనూ స్నేహపూరితంగా ఉండడమే ఆయన విశిష్టతగా చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -