Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో సన్మానం   

 సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో సన్మానం   

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్  
పట్టణంలో సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్ వన్ లో 171వ ర్యాంకు సాధించి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియామకమైన శివరాజ్ ను ఆదివారం పూలమాలలు, శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్మీయ మిత్రమండలి సభ్యులు ఖాందేష్ శ్రీనివాస్, గుజరాతి నివేదన్, జెస్సు ఆనంద్ మాట్లాడుతూ ఆర్మూర్ కు చెందిన హౌసింగ్ రిటైర్డ్ డిఈ కర్తన్ శ్యాంసుందర్, అరుంధతి దంపతుల కుమారుడు శివరాజ్ ప్రస్తుతం ముంబాయిలో స్టాక్ ఎక్స్చేంజి సెబిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారనీ తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్ వన్ లో ఎంపికైన క్షత్రియ యువకుడు శివరాజ్ క్షత్రియులు అందరికీ ఆదర్శం అన్నారు. నేటి యువకులు శివరాజ్ ను ఆదర్శంగా తీసుకొని పోటీపడి చదివి ఉద్యోగాలు సాధించాలని కోరారు. శివరాజ్ గ్రూప్ వన్ లో ఎంపిక కాకున్న ముందు యు పి ఎస్ సి లో నాలుగు సార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు.

గ్రూప్ వన్ లో ర్యాంక్ సాధించి ఉన్నత ఉద్యోగం సాధించిన శివరాజు క్షత్రియ కులస్తులందరికీ గర్వకారణం అన్నారు. ఇందులో శివరాజ్ తో పాటు ఆయన సతీమణి శివానికి సైతం మిత్ర మండలి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు సాత్ పుతే శ్రీనివాస్, డీజే దయానంద్, బొచ్ కర్ వేణు, షికారి రాజు, నూతన్ శ్రీనివాస్, బారడ్ ప్రవీణ్, దొండి అరుణ్, ఖాందేశ్ ప్రవీణ్, కర్తన్ శ్యాంసుందర్, అరుంధతి, బొబిడే శ్వేత, కర్తన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -