- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ గడపాలే ఆకాశ్ ను శనివారం ముధోల్ గ్రామస్తులు శాలువతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మతిన్, బీసీ సంఘం మాజీ అధ్యక్షులు గుంజలోల్ల నారాయణ, మాజీ కోశాధికారి మేత్రి సాయినాథ్, అంబులెన్స్ డ్రైవర్ గడ్డం సుభాష్, స్థానికులు లక్ష్మన్న, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -