- Advertisement -
నవతెలంగాణ – రాయపర్తి
ఇటీవల విడుదలైన గ్రూప్ – 1 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన యువకుడు ఇల్లందుల రాకేష్ మండలంలోని బంధనపల్లి గ్రామానికి చెందినవాడు. రాకేష్ నిర్మల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియమితులు కాగా సోమవారం మహా ఆది సేవ సమితి (మాస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుపై ఆసక్తి పెంచుకొని కుటుంబానికి, జాతికి గౌరవాన్ని తీసుకువచ్చిన రాకేష్ కు మాస్ ఎప్పుడు అండగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ టీం వరంగల్ జిల్లా నాయకులు డాక్టర్ సీనపల్లి విక్రమ్ కుమార్, డాక్టర్ అలవాలా విజయ్ కుమార్, వరంగల్ డిసిహెచ్ డైరెక్టర్ డాక్టర్ రామ్మూర్తి, కొండేటి మధు, కొండేటి భాస్కర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -