Sunday, November 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పదోన్నతులు పొందిన క్లాస్మేట్స్ కు సన్మానం..

పదోన్నతులు పొందిన క్లాస్మేట్స్ కు సన్మానం..

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని 1986-87 లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందిన నాలుగురు పూర్వ విద్యార్థులను తోటి పూర్వ విద్యార్థులు జన్నారం మండల కేంద్రంలోని పీ ఆర్ టీ యూ భవన్ లో ఘనంగా సన్మానించారు. జగిత్యాల లో జిల్లా మైనార్టీ కార్పొరేషన్ వెల్పర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన ఆర్. చిత్రు పటేల్, ఉట్నూర్ మండలం లో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయునిగా పదోన్నతి పొందిన సీ హెచ్. లక్ష్మణ్,మంచిర్యాల మహిళ పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ ఐ గా పదోన్నతి పొందిన దస్తగిరి, జగిత్యాలలో ఏ ఆర్ ఎస్ ఐ గా పదోన్నతి పొందిన జీ నర్సయ్య ను ఘనంగా సన్మానిoచ్చారు. ఈ కార్యక్రమం లో 30 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పీ ఆర్ టీ యూ మండల ప్రెసిడెంట్ కట్టా రాజమౌళి, సంఘo నాయకులు అనుముల రాజన్న, రాజారావు లు చిత్రు పటేల్ ను సన్మానించారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -