- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రీడల్లో వివక్షకు తావులేదు. దివ్యాంగులు, బధిరుల క్రీడలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. 27వ జాతీయ సీనియర్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ పారా అథ్లెట్లను గురువారం ఎల్బీ స్టేడియంలోని తన చాంబర్లో చైర్మన్ ఘనంగా సన్మానించారు. పతకాలు సాధించిన పారా అథ్లెట్లు బి. గోపి, కెస్ఆర్ హాసిని రెడ్డి, సూర్యను శివసేనా రెడ్డి అభినందించారు. సీఎం కప్ పోటీల్లో ప్రత్యేకంగా పారా క్రీడలు నిర్వహించామని, గత ఏడాది మాదిరిగానే ఇప్పుడూ వేసవి శిక్షణ శిబిరాల్లో పారా క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని చైర్మన్ తెలిపారు.
- Advertisement -



