Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వ్యక్తులకు సన్మానం

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వ్యక్తులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఇద్దరు వ్యక్తులను గురువారం ఘనంగా సన్మానించారు. పర్యావరణ సంరక్షణ కోసం గ్రామానికి చెందిన ధాత్రిక రాజ్ కుమార్, ఉట్నూర్  ధోని లను హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సత్కరించారు. ప్లాస్టిక్ను నిర్మూలించాలని లక్ష్యంతో  వీరిద్దరూ గ్రామంలో జరిగే అన్న వితరణ, శుభకార్యాలకు స్టిల్ ప్లేట్లను, గ్లాసులను అందజేస్తున్నారు. ఇటీవల వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమాల్లో వీరంందించిన స్టీల్ ప్లేట్లను, గ్లాసులనే నిర్వాహకులు ఉపయోగించారు.

తద్వారా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిర్మూలనకు వీరు అందించే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు దోహదం చేస్తున్నాయి. గ్రామంలో వీరి సేవను పలువురు కొనియాడుతున్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా విరందించిన  తోడ్పాటును అభినందిస్తూ రాజు, ధోనిని శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యులు దొంతుల రమణయ్య, ఉట్నూర్ రాజశేఖర్, భోగ రామస్వామి, అమెడ నరేందర్, ఆమెటి శంకర్, అజయ్, అడిచర్ల రవీందర్, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -