Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉపాధ్యాయులకు శనివారం జిల్లా కేంద్రం సిద్దిపేట టిటిసి భవనంలో ఘనంగా సన్మానం చేశారు. దానిలో భాగంగానే జిల్లా ఉత్తమ విద్యాధికారిగా ఎంపికైన సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పి. వెంకటేష్, లింగారెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జిటి ఉపాధ్యాయులు షేక్ అబ్దుల్, యెల్కల్ ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జిటి ఉపాధ్యాయులు ఎస్. నరసింహ లను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్, జిల్లా  విద్యాధికారి ఈ. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి,రాయపోల్  మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా సత్కరించి అవార్డు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడి బడి అడుగులతో పాఠశాలలో చేరిన బాల్య దశలో అక్షర జ్ఞానం కల్పించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేసే వారే ఉపాధ్యాయులు అన్నారు. కుల మత భేదలు, ధనిక పేద వ్యత్యాసాలు లేకుండా అందరికీ సమానమైన జ్ఞానాన్ని అందిస్తారని అటెండర్ క్లర్క్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల వద్ద విద్యను అభ్యసించడం వల్లనే ఆ స్థాయికి చేరుకోగలుగుతారు.

అలాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శవంతులు అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని మా ఎంపికకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సత్కరించిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరింత బాధ్యత పెంచిందని ఇకమీదట ఇంకా ఎంతో ఉత్సాహంగా పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ సంఘాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad