నవతెలంగాణ – మర్రిగూడ
మండల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత, మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలలకు చెందిన 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, జిల్లాస్థాయి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులకు, మండల వనరుల కేంద్రం సిబ్బందికి బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి వేణుగోపాల్,ఎంపీడీవో జిసి మున్నయ్య ఎంఈఓ బిట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రవికుమార్,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు మాలతి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేశం,కేజీబీవీ ఎస్ఓ సంఘ నాయకులు ఉదావత్ లచ్చిరాం,ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES