- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల విడుదలైన గ్రూపు-3 ఫలితాలలో ట్రేజరీ & అకౌంట్ శాఖలో సీనియర్ అకౌంటెంట్ గా ఎంపికైన అట్టి మల్ల బాలరాజు విశాఖ కాలనీలోని ఆయన స్వగృహంలో స్పా జు ఫోరం జిల్లా పక్షాన శుక్రవారం సన్మానించినారు. 2005లో ఎస్ జి టి నియామకమై గత ఇరవై ఏళ్లగా ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతూనే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
- Advertisement -



