Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను, ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలు లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామాల వారీగా సకుటుంబ సమేతంగా వచ్చిన గ్రామస్థాయి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాబోయే రోజులలో ప్రజాప్రతినిధులుగా మంచి పేర్లు గడించాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు తుకారామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తుకారం ,రాజు, నూతనంగా ఎన్నికైన గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు సోపూర్ జాన్సన్, డోన్గావ్ గజిరే రాజు, కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్ చంద్రకళ, బిజల్ వాడి సర్పంచ్ గంగాబాయి,  ఎమ్మార్పీఎస్ మండల డివిజన్ జిల్లా స్థాయి నాయకులు జిరాక్స్ సురేష్, నాగనాథ్ , మాదవ్ , సాయిలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -