Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు సన్మానం

కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
 మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వార్డు సభ్యులను మంగళవారం ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీ సహకారంతో గెలుపొందిన  ఆరుగురు వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధికి, కాలనీల్లో సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు తమ వంతుగా కృషి చేయాలని ఈ సందర్భంగా సుంకేట రవి నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు సూచించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దూలూరి కిషన్ గౌడ్, ఉట్నూరి ప్రదీప్, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -